As primeiras 200 linhas.
కొందరు పుట్టడమే విజేతలుగా పుడతారు.
టామ్ బ్రేడి,
లెబ్రాన్ జేమ్స్,
జోయి చెస్ట్ నట్,
అలాగే నేను కూడా.
నా పేరు డస్టీ బోయ్డ్,
కానీ ప్రపంచంలో చాలా మందికి నేను ద హామర్ గా సుపరిచితం.
మా నాన్న నా అసలు పేరు ఏంటో నాకు చెప్పడానికి ముందే నాకు ఆ ముద్దుపేరు పెట్టారు.
అంతే, అద్భుతంగా కొడుతున్నావు, హామర్. అంతే.
ఆయన ఒక రేసు గుర్రానికి శిక్షణ ఇచ్చినట్టు నాకు టెన్నిస్ శిక్షణ ఇచ్చారు.
నా చేతులకు టెన్నిస్ రాకెట్లు కట్టేసి మరీ కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇచ్చారు.
మా నాన్న మిగతావారి నాన్నల్లా కాదు.
ఆయన నాకు చదవడం నేర్పించలేదు. బాల్ ని ఎలా కొట్టాలో నేర్పించారు.
ఆటతీరు మెరుగవుతోంది, హామర్!
అనుకున్నట్టే అయింది. ప్రతీ యు.ఎస్.టీ.ఏ జూనియర్ రికార్డు బద్దలుకొట్టా.
బలమైన ఆటతీరు ప్రదర్శించిన హామర్ "నిజమైన టెన్నిస్ దిగ్గజం"
విజయాలు, ఏస్లు, షూట్ అవుట్స్. ప్రతీ విధమైన గుర్తింపు సాధించాను.
కాబట్టి త్వరలోనే ప్రపంచం నన్ను గుర్తించింది.
లేదు, డేవ్. నేను గట్టిగా మాత్రమే కొట్టను.
అందరికంటే గట్టిగా కొడతాను.
కాబట్టి నేను హై స్కూల్ నుండి పాస్ కావడానికి ముందే…
డి. బోయ్డ్
- …మా నాన్నా, నేను కన్న కలలు నిజం చేసుకున్నా. - డస్టీ, ఇక్కడ చూడు!
- నేను ప్రొఫెషనల్ ని అయ్యాను. - ఇలా చూడు! డస్టీ, ఇక్కడ చూడు!
ప్రో సర్క్యూట్ - యు.ఎస్.టీ.ఏ మెన్స్ సింగిల్స్
ఇది, మిత్రులారా, నా అద్భుతమైన నిజజీవిత కథ.
సరే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
అవును, మాతో ఆడించే ఉద్దేశం ఏమైనా ఉందా?
నీ లెసన్ పరమ దరిద్రంగా ఉంది.
నా ఉద్దేశం నేను చెప్పిన కథ గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
నేను స్పష్టంగానే చెప్పాను, కదా?
చాలా వివరంగా చెప్పావు. నాకు ఒక సందేహం ఉంది, కింగ్.
మీ నుండి నేను ఆశపడిన రియాక్షన్ ఇది. పీజే, అడుగు.
నేను ఈ కథ విన్న ప్రతిసారీ నాకెందుకు ఇప్పటికీ ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది?
- నాకూ గగుర్పాటు కలుగుతుంది. - నిజంగా, నా ఉద్దేశం,
- నువ్వు అందరిలోకీ… - నీకంత ట్యాలెంట్ ఉంటే,
ఇంకా ఎందుకు మీ నాన్న క్రింద పనిచేస్తూ తొమ్మిదేళ్ల పిల్లలకు పాఠాలు నేర్పుతున్నావు?
ఈ సన్నాసులు ఆండీ రోడిక్ కథ వినే సమయమైంది అనుకుంట.
- ఓహ్, అలా అనిపిస్తుందా? - ఓహ్, వద్దు, వద్దు, వద్దు.
- దయచేసి ఇంకొక కథ చెప్పకు. - అది వీరో బీచ్ క్లాసిక్.
ఓహ్, దేవుడా!
అది 2000వ సంవత్సరం. నేను వర్సెస్ ఆండీ రోడిక్.
వీరో బీచ్ యు.ఎస్.టీ.ఏ
టెక్నీకల్ గా అతనికి నాకంటే ఎక్కువ పేరు ఉంది, కానీ అందరూ నన్ను చూడటానికే వచ్చారు.
లవ్ యు, హామర్!
అదరగొట్టు! హామర్!
మేము ఔత్సాహికులుగా కొన్నిసార్లు ఆడాం.
కానీ నేను వాడితో ఆడిన ప్రతిసారి, వాడిని చిత్తుగా ఓడించాను.
అక్షరాలా అదే జరిగింది.
నాకు నమ్మకం లేదు.
కానీ ప్రొఫెషనల్స్ గా అదే మా మొదటి ఆట.
- నేను వాడిని నలిపేస్తున్నాను. - అద్భుతం.
అదరగొట్టు, హామర్.
అది నా కొడుకు.
అప్పుడే నీచుడైన మిస్టర్ ఆండీ తన కపటబుద్ధి చూపించాడు.
అవును. బాత్రూమ్ బ్రేక్ తీసుకుని నా దృష్టి మళ్లించాలి అనుకున్నాడు.
కాబట్టి వాడిని ఎదుర్కోవడానికి నేను అక్కడికి వెళ్లాను.
తడిగా ఉన్న ఒక చోట జారిపడ్డాను.
- అందువల్ల నా మణికట్టు విరిగిపోయింది. - ఓహ్!
రోడిక్!
అలా జరగడంతో, ఉజ్వలంగా వెలగాల్సిన నా కెరియర్ ని నేనే నాశనం చేసుకున్నా.
- ఏంటి? - కచ్చితంగా, ఆండీ ఫ్రాడిక్,
బాత్రూమ్ నేల మీద ఏదో ఒక రకమైన పదార్థాన్ని పోసాడు.
కాబట్టి రోడిక్ ప్రొఫెషనల్ గా సాధించిన విజయాలు అన్నీ,
నా ఉద్దేశం యుఎస్ ఓపెన్ లో గెలవడం, అలాగే సూపర్ మోడల్ బ్రూక్లిన్ డెకర్ ని పెళ్లి చేసుకోవడం,
అవన్నీ నిజానికి డస్టీ విజయాలు.
నిజానికి ఇది చాలా ఆసక్తికరమైన ఐడియా.
- నేనెప్పుడూ అలా ఆలోచించలేదు… - ఒక్క నిమిషం.
ఆ సంఘటన కారణంగా అతని విజయాలు నీ విజయాలు ఎలా అవుతాయి?
అవును, నాకు కూడా అర్థం కావడం లేదు.
బహుశా నువ్వు అర్థం చేసుకోవడం ఎలాగో నేర్చుకోవాలేమో.
భలే కౌంటర్ వేశావు.
ఏదైతేనేం, ఇక నాకు మీతో మాట్లాడాలని లేదు. నాకు చాలా బోర్ కొట్టింది.
మీరు పాఠాలు నేర్చుకుంటారని నాకు అనిపించడం లేదు.
మరిక కొన్ని టెన్నిస్ బాల్స్ కొట్టే ఉద్దేశం ఏమైనా ఉందా?
- అవును. హమ్మయ్య. ఓహ్, దేవుడా! ప్లీజ్. - అవును. ప్లీజ్.
ఒక్క క్షణం.
నేను చేయాల్సిన పని ఒకటి ఉంది.
- హేయ్! - క్షమించండి.
- అది ఇలా ఇస్తారా? - సరే. తప్పకుండా.
నీ పికిల్ బాల్ ఇదుగో.
చెత్తబుట్టలో వేశాను!
ఇది టెన్నిస్ క్లబ్, లేడీ.
- వెధవ! - నేను అది విన్నాను.
మంచిది. నా ఉద్దేశం కూడా అదే. అందుకే గట్టిగా అన్నాను.
సరే, పికిల్ బాల్ లేడీ. తేల్చుకుందాం పదా.
పీజ్. ఒక ఆట ఆడదాం.
నీకు గేమ్స్ ఇష్టం కదా. పికిల్ బాల్ ఆడతావు, కదా?
- ఈ క్వార్టర్ చూశావా? - అవును.
దీన్ని ఈ కోర్ట్ లో ఎక్కడైనా పెట్టు, నేను ఒకే షాట్ తో దాన్ని కొడతాను.
నేను గనుక కొడితే, నువ్వు జీవితాంతం బ్యాన్ చేస్తాం.
కానీ నేను మిస్ అయితే, ఒక ఏడాది నీ మెంబెర్షిప్ ఫీజు మాఫీ చేస్తాను.
ఓహ్. నేను బ్యాన్ అవుతానా?
సరే, నేను ఇక్కడ మెంబెర్ ని కాదు కాబట్టి అలా చేసినా నాకు నష్టం లేదు.
నేను లెసన్ నేర్చుకుంటున్నా అంతే.
సరే, అయితే ఒకపని చేద్దాం. నీకు ఇంకా మంచి డీల్ ఇస్తా.
నేను గనుక ఈ షాట్ మిస్ అయితే,
నేను ఇవి నీకు ఇస్తాను.
డస్టీ, వద్దు. నీ 1999 బ్యూయిక్ ల సేబ్రే?
అవును. నేను 3.2 లక్షల కిలోమీటర్లకు తక్కువ తిరిగిన నా 1999 బ్యూయిక్ ల సేబ్రేని ఇస్తాను.
నాకేం చేయాలో తెలీడం లేదు.
నాకు ఇక నీతో మాట్లాడే ఉద్దేశం లేదు, కానీ నువ్వు దీన్ని కొడితే చూడాలని ఉంది.
ఏం చేయాలి? సరే.
ఆడదాం.
ఎక్కడైనా పర్లేదా?
నీకు నచ్చిన చోట పెట్టు.
నేను ఇక్కడ పెడుతున్నాను.
కష్టమే. కార్నర్ లో పెట్టావు.
కొట్టావు!
వెళ్ళిపో! వెళ్ళిపో! వెళ్ళిపో!
దేవుడా.
నీ పికిల్ బాల్ ఆడే మొహం ఇంకెప్పుడూ ఇక్కడ చూపించకు.
నువ్వు వెళ్ళడానికి ముందు ఒక మాట.
కాస్త నవ్వు, నిన్ను బ్యాన్ చేస్తున్నాం.
గాడిదగుడ్డు. అబ్బా.
సూపర్!
నా నేమ్ ప్లేట్ మీద ఏమని రాసి ఉందో చెప్తావా, డస్టీ?
చెప్పగలను, నాన్నా.
దాని మీద, "చక్ బోయ్డ్. టెన్నిస్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్" అని ఉంది.
ఓరి నాయనో.
- వినడానికి చాలా ముఖ్యమైన పదవిలా ఉందే, హహ్? - అవును.
తన కొడుకు ఒక సన్నాసిలా డ్రెస్ చేసుకుని, పనికి లేట్ గా వచ్చి, జనాన్ని క్లబ్ నుండి బ్యాన్ చేస్తుంటే
- చూడాలనుకునే పదవిలోని మనిషిలా అనిపించడం లేదు. - అవును.
నిజం చెప్పాలంటే, నేను నీ గురించి మాత్రమే అనడం లేదు.
ప్రస్తుతం ఈ క్లబ్ నడుస్తున్న తీరు బాలేదు అనిపిస్తోంది, కాబట్టి నేను పరిస్థితిని చక్కదిద్దబోతున్నా.
ఇవాళ రాత్రికి నేను నీతో సహా సంస్థలోని ముఖ్యమైన వారందరినీ భోజనానికి ఆహ్వానిస్తున్నాను.
ముఖ్యమైన వారితో పాటు నేను కూడా ఉంటా.
అవును, రాకపోతే బాగోదు. అలాగే అక్కడ నా పరువు తీయడానికి వీలులేదు.
నువ్వు సమయానికి రావాలి, అలాగే ఇప్పుడు వేసుకున్న ఆ పిచ్చి హెడ్ బ్యాండ్ తీసేయ్,
పైగా నా కొడుకు ఒక చేతకానివాడు అన్నట్టు వాళ్ళందరూ చూడకుండా
నువ్వు నీతో పాటు ఇంకొకరిని తీసుకుని రావాలి.
అలాగే, సర్.
రాత్రికి నీకు వీలవుతుందా, మిత్రమా?
నేను కొంచెం ఆలోచించాలి.
వీడిని కాదు!
నువ్వు కలుస్తున్న ఆ అమ్మాయిని తీసుకునిరా. ఆ అందమైన అమ్మాయిని.
దురదృష్టవశాత్తు, మరిస్సా, నేను… మేము విడిపోయాం.
సరే, అయితే వెళ్లి సారి చెప్పి తనతో తిరిగి కలువు.
- అది అంత సింపుల్ కాదు. - వెళ్ళు.
సరే. మనం ఇంతసేపూ నా గురించే మాట్లాడుకున్నాం అనిపిస్తోంది.
నువ్వు ఎలా ఉన్నావు?
నేను వెళ్తానులే. నువ్వు నన్ను చేయమన్న పని చేస్తాను.
కానివ్వు. నువ్వు ఇది చేయగలవు.
భలే, భలే, భలే.
పాక్కుంటూ మళ్ళీ వెనక్కి ఎవరొచ్చారో చూడండి.
- లేదు. నా మనసు మార్చుకున్నాను. నా వల్ల కాదు. - ఆగు!
- లేదు, ఇది నా వల్ల కాదు, మరిస్సా. - అవును, అవుతుంది.
- లేదు, నా వల్ల కాదు. - వెనక్కి రా.
నీకు ఏం కావాలి?
- నాకు ఒక సాయం కావాలి. - సరే.
ఒక్క రాత్రికి మనిద్దరం తిరిగి కలిసినట్టు నువ్వు నటిస్తూ
మా నాన్న ఇంటికి భోజనానికి రావాలి.
ఓహ్, అమ్మో!
మీ అబ్బాయిలకు ఇలాంటి ఆటలు చాలా ఇష్టం కదా?
ఒక్క నిమిషం నేను ప్రపంచంలోనే అందరికంటే చెడ్డదాన్ని. ఇంకెప్పటికీ నన్ను చూడాలని లేదు అంటావు.
నన్ను "మోసం చేశావు" అని కూడా అన్నావు అనుకుంట.
నువ్వు నిజంగానే నన్ను మోసం చేశావు కాబట్టి అలా అన్నాను, మరిస్సా.
డస్టీ?
- ఏంటి? - అలా ఒక్కసారే జరిగింది.
ఎనిమిది సార్లు జరిగింది.
అవును, కానీ ఒక్కడితోనే కదా.
తొమ్మిది మందితో!
ఓహ్, దేవుడా.
ఏంటి, నువ్వేమైనా రెయిన్ మ్యాన్ వా? అన్నీ గుర్తుంచుకుంటున్నావు.
చూడు, మరిస్సా, నాకు ఈ ఒక్క సాయం చేసిపెడతావా?
- ప్లీజ్. - సరే, అలాగే.
థాంక్స్.
అవును, నిజమే.
రచయిత మాల్కోమ్ గ్లాడ్వెల్ రాసింది ఏమైనా చదివారా?
బీటిల్స్ బృందం బాగా ప్రాక్టీసు చేయడం వల్లే అంత గొప్పోళ్ళు అయ్యారని ఒక ఆర్టికల్ రాశాడు.
అది చదివిన వెంటనే నా మతి పోయింది.
లేదు, నాకు అస్తమాను అదే గుర్తుకొస్తుంటుంది.
- నిజంగా? - అవును. నిజంగా అంటున్నా.
- నాన్నా, నేను ఎవరిని తీసుకొచ్చానో చూడు. - మరిస్సా.
మేము రావడం లేట్ అయి ఉండదని ఆశిస్తున్నా, చక్.
మేము మీకు మనవడిని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం.
అంటే, నిజానికి ఈసారి మీరు ఆలస్యంగా ఏం రాలేదు, అల్లరి వెధవ.
నేను అల్లరి వెధవని.
- నా గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ చేసేటప్పుడు… - అవును.
…ఎదురయ్యే ఫీలింగ్ చాలా ఇష్టం.
చాలా మంచిది.
చాలా మంచిది.
- ప్లీజ్, ఇక అందరూ కూర్చోండి. - ప్లీజ్, కూర్చోండి.
- మమ్మల్ని పిలిచినందుకు థాంక్స్, సర్. - సరే.
టెన్నిస్.
రమ్యమైంది.
అందానికి అర్థాన్ని ఇచ్చేది.
కానీ టెన్నిస్ ఒక క్రీడ మాత్రమే కాదు.
అది ప్రాణాలతో ఉన్న ఒక జీవి,
కాబట్టి దానికి మన రక్షణ కావాలి.
ఒకప్పుడు గొప్ప దేశంగా వెలిగిన మన దేశంలో ఒక మహమ్మారి వ్యాపిస్తోంది.
దాని పేరు…
పికిల్ బాల్.
- అది క్రీడలకు పట్టిన నోవెల్ కరోనా వైరస్. - అవును.
మన పేరు పెంచుకోవడానికి ఒక డీల్ లో భాగంగా
మౌంటెన్ క్రెస్ట్ లోని అత్యంత చెత్త కోర్ట్ ని ఈ సన్నాసులకు ఇచ్చాం.
కానీ ఇప్పుడు ఈ పికిల్ బాల్ ఆటగాళ్లకు మరిన్ని కోర్టులు కావాలంట.
విస్తరణపై జరిగే ఓటును నేను ఇంకెన్నాళ్లో ఆపలేను.
పైగా మనం గనుక ఓడిపోతే, వాటి విస్తరణ ఎప్పటికీ ఆగకపోవచ్చు.
మన క్లబ్ ఆఖరిగా నిలబడిన కోట లాంటిది.
No comments yet. Be the first to leave one.