ആദ്യത്തെ 200 വരികൾ.
కన్ను మూసి తెరిచే సమయంలో యుద్దం ఆగిపోయింది.
లైకన్ ల(తోడేళ్ళ) చరిత్రలోనే అత్యంత భయంకరమైన నాయకుడైన లూసియన్
ఎట్టకేలకు చంపబడ్డాడు.
లైకన్ గుంపు చెల్లాచెదురయిపోయింది...
ఒక్క సాయంత్రం పాటు రగిలిన ప్రతీకార జ్వాలలో.
విజయం, చూడబోతే, మా వశం అయ్యినట్టు అనిపించింది,
మా వంపైర్ ల జన్మ హక్కు.
ఆ రాత్రి జరిగి సుమారు 600 ల సం||లు గడిచాయి.
కానీ లూసియన్ తో పాటు గా ఈ పురాతన పగ అంతం అవ్వలేదు.
లైకన్ లు చాలా కొద్దిమందే ఉన్నా...
ఈ యుద్దం ఇంకా ప్రమాదకరంగా మారింది,
ఎందుకంటే చంద్రుని శక్తి పై వాళ్ళ అవసరం తగ్గింది.
పెద్ద వయసు గల, బలవంతమైన లైకన్ లు తమంతట తామే మారగలుగుతున్నారు.
ఆయుధాలు పరిణామం చెందాయి, కానీ మా ఆజ్ఞలు మాత్రం అలాగే ఉన్నాయి:
వాటిని వేటాడి, ఒక్కొక్కటిగా, చంపేయడమే.
ఎంతో విజయవంతమైన ఉద్యమం.
ఏమో, మరీ ఎక్కువ విజయవంతమేమో.
డెత్ డీలర్ (మృత్యు యోధురాలు) అయిన నాలాంటి దానికి,
ఈ విజయం ఒక యుగాంతానికి గుర్తు అయ్యింది.
గత శతాబ్దపు ఆయుధాల లాగా,
మేమూ పనికిరాకుండా పోతాం.
బాధాకరం, ఎందుకంటే నేను అందుకే జీవిస్తున్నాను.
ఓయ్!
రక్తాలు!
పర్లేదు. పర్లేదు. నీకేం కాదు.
మీరంతా ఓ వీధి కుక్కల మందలా ప్రవర్తిస్తున్నారు!
ఇంకా అది, పెద్దమనుషులారా,
అస్సలు పనికి రాదు.
అదీ వంపైర్ లను వాటి సొంత స్థలంలోనే మట్టుబెట్టాలంటే.
అదీ మీరు బ్రతికి బట్టకట్టాలంటే.
పియర్స్! టేలర్!
కొంచెం బట్టలేసుకుంటారా, మీరూ?
మనకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.
నేను కొన్ని పరీక్షలు చెయ్యాలి.
ఇది ఖచ్చితంగా ఏదోరకమైన ఉద్యోతనం చెందిన ద్రవం.
అల్ట్రా వైలట్ మందు గుళ్ళు!
సూర్య కాంతి, ఆయుధ రూపంలో.
అంటే, నేను ఒక రోగిష్టి జీవి,
ప్రత్యేకించి వాంపైర్ లను మట్టుబెట్టే ఆయుధం కనిపెట్టిందంటే, నమ్మాలా?
లేదు, నా ప్రకారం ఇది మిలిటరీ వస్తువు.
వాళ్ళు దొంగిలించి ఉండవచ్చు. ఏదో హైటెక్ శోధన వస్తువు.
చూడండీ, వాళ్ళకి ఇవి ఎక్కడనుంచి వచ్చాయనేది నాకు అనవసరం.
రైజెల్ చనిపోయాడు, నథానియెల్ ఇంకా అక్కడే ఒంటరిగా ఉండవచ్చు.
మనం మృత్యు యోధుల బృందంతో అక్కడికి ఇప్పుడే వెళ్ళాలి.
అస్సలు కుదరదు. అదీ ఇప్పుడు. అదీ కారణం లేని ఆకస్మిక దాడికి.
మేలుకొలుపు కి ఇంకా కొద్దిరోజులే ఉంది, ఇంకా ఈ తెగ లో రేగిన అలజడి అలానే ఉంది.
కారణం లేదా? వాళ్ళు మనుషుల ముందు మనపైన కాల్పులు జరిపారు.
ఇంకా ఆ సొరంగంలో నేను విన్న అలజడిని చూస్తే-
నువ్వే చెప్పావు, నువ్వేమీ చూడలేదని.
చూడు, నేనేం విన్నానో నాకు తెలుసు, ఇంకా నా మనసు ఏం చెప్తుందో నాకు తెలుసు.
ఇంకా నేను మీకు చెప్తున్నాను, అక్కడ కొన్ని డజన్ ల కొద్దీ లైకన్ లు ఉండొచ్చు.
ఏమో, ఇంకా ఎక్కువ కూడా. వందల్లో.
మనం వాటిని దాదాపు సమూలంగా నాశనం చేశాం.
క్రేవెన్ చెప్పేది నిజమే, సెలీన్.
అంత పెద్ద స్థావరం కొన్ని శతాబ్ధాల గానే లేదు,
అదే కూడా లూసియన్ రోజుల నుంచి.
నాకది తెలుసు, ఖాన్.
కానీ మీరు ఒక సారి పరిశీలించి నన్ను తప్పుబడితే, నేనూ ఆనందిస్తాను.
సరే, నీ మనుషుల్ని సిద్ధం చెయ్యి.
నేను సోరెన్ తో ఓ బృందాన్ని పంపిస్తాను.
లేదు, నేనే ఆ బృందానికి ప్రాతినిధ్యం వహిస్తాను.
సమస్యే లేదు! అంతా సోరెన్ చూసుకుంటాడు.
వందలా? నిజంగా?
విక్టర్ నన్ను నమ్ముతాడు.
కల్లో కూడా నేను నీతో అలా మాట్లాడను.
ఆ విషయం నాకు తెలుసులే.
వెళ్ళి తను అతిథుల ఆహ్వానానికి మంచి డ్రస్ లో రెడీ అయ్యేలా చూడు.
ఇదొక టైమ్ వేస్ట్, నీకు తెలుసా?
ఏది?
విక్టర్ కూడా నువ్వు ఇక్కడ చచ్చే వరకూ ఉండిపోవాలని అనుకోడు.
తన సమాధిని చూస్తూ.
లేదు, తనైతే ఈ క్షణం మృత్యు యోధుల చేత నగరంలో అణువణువూ జల్లెడ పట్టించేవాడు.
క్రేవెన్. నాకు అస్సలు అర్ధం కాదు, విక్టర్ వాడిని ఎందుకు పదవిలో పెట్టాడో.
వాడో రాజకీయ వేత్త, యోధుడు కాదు.
పదా, మనం నిన్ను సిద్ధం చెయ్యాలి.
ఎందు కోసం?
పార్టీ కి.
అమీలియా బృందం ఏ క్షణానైనా ఇక్కడకి రావచ్చు.
ఆ, అవును.
నువ్వు ఇది వేసుకొని తీరాలి. ఇది అదిరింది.
వాళ్ళు నీ వెనక పడుతున్నారు.
కుర్రోడు బాగున్నాడు.
మనిషి స్థాయికి.
ఎవరు అందంగా ఉంది?
నీకు తెలుసు, నేను ఈ సాయంత్రం నిన్ను నా ప్రక్కనే ఉంచుకోవాలనుకుంటున్నానని.
ఎరికా ని తీసుకెళ్లు. తనూ నీ ప్రక్కన ఉండాలని తెగ ఆరాట పడుతుంది.
నన్ను అడిగితే, నువ్వు ఈ యోధురాలి వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకుంటున్నావు.
నువ్వు చరిత్ర ని మార్చలేవు, నువ్వు ఎంత మందిని చంపినా సరే.
పైగా...
అమరత్వం లో అర్ధం ఏముంటుంది,
జీవితం లో చిన్నచిన్న సుఖాలు కూడా అనుభవించకపోతే?
ఈ మానవుని చూశావా?
ఏముంది వాడిలో?
నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నాకనిపిస్తుంది లైకన్ లు ఎందుకో-
చ్చ!
కొంచెం మంచి డ్రస్ వేసుకో, అదీ త్వరగా.
క్రేవెన్, నేను సీరియస్. వాళ్ళు తనని వెంబడిస్తున్నారు.
తినడానికి మినహా, లైకన్ లు ఓ మనిషిని ఎందుకు వెంబడిస్తారు?
ఏమన్నా పురోగతి ఉందా?
చూద్దాం.
విఫలం.
ఇంటికి వెళ్తున్నావా?
ఆ, నికోలాస్ ముందే వెళ్లొచ్చన్నాడు.
పనిలో పనిగా...
నువ్వు ఈ పూట సర్జరీ అదరగొట్టావు అన్నాడు.
ఆ.
కొంచెం సేద తీరు.
మమ్మల్ని మాటు వేశారు.
మృత్యు యోధులు, ముగ్గురు.
మరి ఆ అభ్యర్ధి?
మేము వాడిని కోల్పోయాము. మీరు వాడిని కోల్పోయారు.
ఈ చెండాలం చూడు.
వెండి గుళ్ళు. ఎక్కువ మోతాదు.
వాడిని మారనివ్వకుండా చేశాయి.
మిగతావి తవ్వి ఉపయోగం లేదు. వెండి వాడి అవయవాల్లోకి చొచ్చుకు పోయింది.
ఇంత నష్టం నుండి పునరుత్పత్తి అసాధ్యం.
వీటిని తీద్దామా.
రిలాక్స్.
ఆ వాంపైర్ లు మీరు ఓ మనిషిని వెంబడిస్తున్నాట్లు తెలుసుకోలేదు,
కదా, రేజ్?
లేదు.
అంటే...
తెలుసుకోలేదు, అనుకుంటా.
అనుకుంటున్నావా, లేక నీకే తెలియదా?
ఖచ్చితంగా చెప్పలేను.
విఫలం.
నేను ఈ మైఖెల్ అనే వాడిని పరీక్షించి తీరాలి.
ప్రతీ పని నేనే చెయ్యాలా?
మన మహోన్నత తెగల మధ్య ఒక సముద్రం ఉండొచ్చు,
కానీ మన రక్త జాతి సంరక్షణ పట్ల మనందరం సమాన కంకణం కట్టుకున్నాం.
ఇంకా అమీలియా వచ్చి మార్కస్ ని మేలుకొలిపిన తరువాత,
మరో రెండు రోజుల్లో,
మనమందరం మరోసారి ఒకే తెగగా మారుతాం!
ఈ ఆతిథ్యానికి మేము ధన్యవాదములు తెలుపుతున్నాము.
తను వచ్చాడో, తన పని తాను చూసుకొని, ఇంటికి వెళ్ళిపోతాడు.
అంతకు మించి, నాకింకేం తెలియదు.
ఇంటర్న్ లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి.
మాకంటూ ఒక జీవితం ఉండదు.
మేము తనని ఎక్కడ కలవోచ్చో తెలుసా?
లేదు. ఆ...
తన ఇంటికి వెళ్ళి చూడండి, లేకపోతే మీరు తను వచ్చే వరకూ ఆగాలి.
తనేమీ ఇరకాటంలో పడలేదు కదా?
ఇది మైఖెల్. నేను ఇప్పుడు ఇంట్లో లేను. దయచేసి మీ మెసేజ్ చెప్పండి.
మైఖెల్, నేను ఆడం ని. ఇప్పుడే పోలీసులు నీకోసం హాస్పిటల్ కి వచ్చారు.
ఆ కాల్పులతో నీకు సంబంధం ఉన్నట్టు వాళ్ళు నమ్ముతున్నారు.
నువ్వు అలాంటి వాడివి కాదని నేను వాళ్ళతో చెప్పాను,
కానీ వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. ఈ నిమిషం.
వాళ్ళు ఎందుకు నీ వెంట పడుతున్నారు?
చ్చ!
హలో, మైఖెల్!
అస్సలేమ్ జరుగుతుందిక్కడ?
కార్ ఆపు.
కార్ ఆపు!
దగ్గరకి రాకు!
సరే.
సరే.
అలాగే.
కానీ నువ్వు చాలా రక్తం కోల్పోయావు.
నువ్వు కార్ ఆపకపోతే, మనమిద్దరం పైకి పోతాం.
నేనేం వేళాకోళం చెయ్యడంలేదు.
నేను కూడా.
ఇంక నోరు మూసుకొని ఊరుకో. నాకేం కాదులే.
చ్చ!
రెండో సారీ దొరకలేదు. అద్భుతం.
చూడబోతే, రేజ్ ఏమీ అంత చేతకాని వాడు కాదేమో.
రేజ్ ఏమీ ఇది తీసుకు రాలేదు.
ఒకవేళ మైఖెల్ నిజంగానే వారసుడైతే, ఆ వాంపైర్ లు-
రిలాక్స్, మిత్రమా.
నేను వాడి మాంసాన్ని రుచి చూశాను.
పౌర్ణమి కి ఇంకా రెండే రోజులు.
త్వరలో, తను ఓ లైకన్ అవుతాడు.
త్వరలో, వాడే మనల్ని వెట్టుక్కుంటూ వస్తాడు.
ఇంత తక్కువ సరుకు వుండటం బాధాకరం.
సఫలం.
కదలకు. నీ తలకు పెద్ద గాయమే తగిలింది.
నువ్వు కొంత సేపటి నుంచీ స్పృహలో లేవు.
వాళ్ళందరూ ఎందుకు నీ వెంట పడుతున్నారో నీకు తెలుసా?
నేను ఎక్కడున్నాను?
నువ్వు సురక్షితంగా ఉన్నావు.
నేను సెలీన్.
అయితే ఈ సారి, చెప్పుడు మాటలు నిజమయ్యాయి.
మొత్తం తెగంతా నీ కొత్త పెంపుడు జీవి గురించే మాట్లాడుకుంటుంది.
నువ్వు వాడిని మారుస్తున్నావు, కదూ?
అలాంటిదేమీ లేదు.
మరైతే వీడిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావ్?
తను నా ప్రాణం కాపాడాడు.
నువ్వెందుకొచ్చావ్ ఇక్కడికి?
క్రేవెన్ పంపించాడు.
తను నిన్ను చూడాలంటా. ఈ క్షణం.
ఇది అస్సలు ఒప్పుకోలేని విషయం!
నువ్వు నా ఆజ్ఞాలకి విరుద్దంగా బంగాళాకి బయట, ఒక రాత్రంతా,
ఒక మనిషితో గడిపుతావా? అదీ తరువాత వాడిని నా ఇంటికే తెచ్చి?
నాకు సంబంధించినంత వరకు, ఇది ఇంకా విక్టర్ ఇళ్లే.
చూడు, నాకేం గొడవ పెట్టుకోవాలని లేదు.
నాకు నువ్వు అర్ధం చేసుకోవాలని ఉంది, ఏంటంటే, మైఖెల్ అంటే లైకన్ లకు ఎందుకో ముఖ్యం-
ఓ, ఇప్పుడు వాడు "మైఖెల్" నా?
క్రేవెన్, ఒకసారి నా మాట కొంచెం వింటావా?
నాకు అస్సలు అర్ధం కావటం లేదు నువ్వేందుకు ఈ పిచ్చి కథని నమ్ముతున్నావో.
లూసియన్ కి ఒక మనిషి పట్ల ఆసక్తి ఉండనే ఉండదు,
మైఖెల్ కానీ, ఇంకెవరైనా కానీ.
No comments yet. Be the first to leave one.