The Witch

The Witch

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

റിലീസ് വിവരങ്ങൾ

The Witch 2015 1080p BluRay x264-[YTS AG]
കമന്ററി എഴുതിയത് Artha
100% Telugu. 99% accurate translation.

ടാഗുകൾ

BluRay
x264
1080
TS
YTS
പ്രസിദ്ധീകരിച്ചത്: 2019-09-11
ഡൗൺലോഡുകൾ: 58
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

మనం ఈ అడవి మధ్యలోకి ఏం దొరుకుతుందని వచ్చాము?

మన దేశాన్ని, బంధువుల్ని వదిలేసి..

...మన పూర్వీకుల ఇళ్లను కూడా.

మనం సముద్రమంత శ్రమించాము...

ఎందుకు? దేని కోసం?

మీరు నిశబ్ధం పాటించాలని మేము కోరుకుంటున్నాము.

విశ్వాసంతో, స్వచ్ఛమైన సువార్త ప్రకటించటానికి కాదా?

- దేవుని రాజ్యం కోసం కాదా? - ఇక చాలు!

మేము నీ న్యాయ నిర్ణేతలమే కానీ, నువ్వు మా నిర్ణేత కాదు.

అబద్దపు క్రైస్తవులు నాకు తీర్పు తీర్చ అనర్హులు.

ఎందుకంటే నేను ఏసు గురించి తప్ప మరే ఇతర విషయం గూర్చి సువార్త ప్రకటించలేదు.

నువ్విలా మొండిగా, గర్వంతో,

ప్రజల మరియు చర్చి చట్టాన్ని కించపరచాలని కంకణం కట్టుకున్నావా?

నా మనసు కి న్యాయం అనిపిస్తే.

అయితే ఈ గ్రామం యిచ్చే రక్షణ నుండి నిన్ను బహిష్కరించడం తప్పదు.

నాకు సంతోషమే.

అయితే పో.. పొయ్యి నీ పీడ నుంచి మాకు విడుదల కలిపించు.

మీరు ఆ ప్రభువుకే ముఖం చాటేశారు, ఎంత బాధాకరం.

కేథరీన్.

తొమసిన్.

పద.

నేను యెహోవకు పరిపూర్ణ హృదయంతో ఒప్పుకోలు చేస్తున్నాను.

రహస్యంగా, నిజాయితీ పరుల మధ్యలో.

నేను ఒప్పుకోలు చేస్తున్నాను నేను పాపంలో జీవించానని.

పనిలో బద్దకించాను, పెద్దల మాట పెడచెవిన పెట్టాను,

ప్రార్ధన విస్మరించాను.

నేను, విశ్రాంతి దినమున, చాటుగా ఆడుకున్నాను.

ఇంకా మనసులో నీ అన్ని ఆజ్ఞలను అతిక్రమించాను.

పరిశుద్ధాత్మ చిత్తంతో కాకుండా నా కోరికల ప్రకారం నడుచుకున్నాను.

నాకు తెలుసు నేను ఇంకా ఎంతో బాధకు, అవమానానికి పాత్రురాలినని..

...ఇంకా నరకపు అగ్నికి కూడా.

కానీ నేను నిన్ను వేడుకుంటున్నాను... నీ కుమారుడు కోసం...

నన్ను క్షమించు, నీ దయ చూపు,

నీ వెలుగు చూపించు.

తొమసిన్.

బూ!

ఇక్కడున్నావ్, ఇక్కడున్నావ్.

బూ!

శామ్ ఎక్కడ? ఎక్కడ శామ్?

ఎక్కడ ఆ చిట్టి మనిషి?

బూ!

ఇదిగో ఇక్కడ, ఇక్కడున్నావ్.

బూ!

శామ్?

శామ్యూయెల్!

తొమసిన్.

నిద్రపో.

అంతా బాగానే ఉంటుంది, నిద్రపో.

కేలెబ్.

దేవుడు మంచి రేపటిని ఇచ్చుగాక.

అందరూ ఇంకా నిద్రపోతున్నారు.

అమ్మ తప్ప.

ఈ బూడిద రంగు రోజుల్లో లేవటం అంత తేలిక కాదు.

ఆ సైతాను మన రెప్పలను గట్టిగా ఆవహించి ఉంటాడు.

- నేను వెళ్ళి లేపుతాను. - వద్దు, వాళ్ళని అలానే ఉండనివ్వు.

మీ అమ్మ అప్పటి నుంచి ఒక్క రాత్రి కూడా నిద్ర పోలేదు...

మనం ఇంకా వెతకలేం, కేలెబ్. వెతకలేం.

ఓ తోడేలు కాకపోతే, ఆకలి ఈ పాటికి వాడి ప్రాణాన్ని తీసి ఉంటుంది.

అడవిలోకి వెళ్దాం పద.

కొంత కాలం నుంచి కొన్ని ఉచ్చులు పన్నాను.

ఈ బాధలు మొదలయిన కన్నా ముందు నుంచే.

అడవి లోకా?

మీ తండ్రికి సాయం చేస్తావా?

నువ్వూ, అమ్మ ఎప్పుడూ అక్కడ అడుగు పెట్టొద్దని మాకు చెప్తుంటారు గా.

కేలెబ్, మన పంట ఈ చలికాలం మొత్తం సరిపోదు.

మనం ఆహారం పండించ లేకపోతే దాన్ని పట్టుకోవాలి.

మనం ఈ అడవిని జయిస్తాం. అది మనల్ని మ్రింగేయలేదు.

అయితే మరి నువ్వు పుట్టుకతోనే పాపివా?

అవును, నేను పాపములో ధరింపబడ్డాను, దోషములో పుట్టాను.

అయితే మరి నీ జన్మ పాపం ఏమిటి?

ఆదాము పాపం నాపై ఆపాదించబడినది, అనైతికత నా స్వభావం గా మారింది.

బాగా గుర్తుపెట్టుకున్నావ్, కేలెబ్, చాలా బాగా.

అయితే మరి నీ అనైతిక ప్రవృత్తి ఏమిటో చెప్పగలవా?

నా అనైతిక ప్రవృత్తి ఏమిటంటే, దయ లేకుండా,

పాపములో, కేవలం పాపములో జీవనం కొనసాగించడం.

శబ్దం చేయకు.

మనం మళ్ళీ ఉచ్చు వేయాలి.

మరి, మరి శామ్యూయెల్ కూడా పాపేనా?

అవును.

అయితే మరి నేను..

తను దేవుని రాజ్యంలోకి ప్రవేశించాడని మనం ప్రార్దిద్దాం.

తనేం పాపం చేశాడు?

దేవుని యందు నమ్మకం వుంచు, కేలెబ్.

మనం ఇంక నీ తమ్ముడు గురించి మాట్లాడబోము.

ఎందుకు?

తను కనిపించకుండా పోయి వారం కాలేదు.

అయినా నువ్వూ, అమ్మ కనీసం తన ఊసే ఎత్తటంలేదు.

తను లేడు, కేలెబ్.

- నాకు ఒకటి చెప్పండి. - ఏం చెప్పాలి నీకు?

- తను నరకానికి వెళ్లాడా? - కేలెబ్!

అమ్మ తన ప్రార్దన ఆపడంలేదు.

ఒకవేళ నేను చచ్చిపోతే, ఈరోజే మరణిస్తే...

- ఏమిటీ ఇదంతా? - నా మనసులో చెడు మెదలుతోంది.

- నా పాపాలు క్షమింప బడలేదు. - నువ్వింకా చిన్నవాడివి...

మరి దేవుడు నా ప్రార్ధనలు వినకపోతే?!

- కేలెబ్! - నాకు చెప్పండి!

ఇలా చూడు, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను,

కానీ మనిషి కాదు, కేవలం దేవుడు మాత్రమే,

తెలుసుకోగలడు, ఎవరు అబ్రహం కుమారుడో, ఎవరు కాదో,

ఎవరు మంచో, ఎవరు చెడో.

నాకు కూడా చెప్పాలని ఉంది, శామ్ ఏసుతోనే ఉన్నాడని,

నువ్వూ, నేను కూడా ఉంటామని.

కానీ నేను అలా చెప్పలేను. ఎవ్వరు కూడా చెప్పలేరు.

కేలెబ్?

ఇవి ఎక్కడివి?

టామ్, స్లేటర్ ఇంతకు ముందు ఇటు పక్కగా వెళ్ళినప్పుడు తీసుకున్నాను.

దేనిని బదులిచ్చారు?

మీ అమ్మ వెండి గిన్నె.

దీని గురించి మీ అమ్మతో ప్రస్తావించకు. అస్సలు.

తను ఇప్పటికే క్రుంగిపోయి ఉంది.

తన బాధ కొంత ఉపశమించగానే తన గిన్నె గురించి చెప్తాను.

దీని గురించి ఇంకా మాట్లాడొద్దు.

సరే.

ఫౌలర్!

వెదవ జంతువు.

ఫౌలర్!

ఏంటి, ఫౌలర్?

దేవునికి స్తోత్రము కలుగుగాక. త్వరపడు, కేలెబ్.

ఈ పాడు తుపాకి!

- నిప్పు ఆరిపోయింది, నాన్న. - అవతల పక్క చూడు.

నాన్న?

నాన్నా!

ఫౌలర్.

బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్, తలపై కిరీటం పెరుగుతుంది.

బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్, ముసలి రాణితో పెళ్ళయింది.

కంచె పైకి దూకి...

- జోనస్! మెర్సీ! ఇక్కడకు రండి! - బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్,

అందరికీ రాజువు...

జోనస్! మెర్సి!

బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్, భూమ్యాకాశాల ప్రభువు

బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్, సముద్ర, సహారాల ప్రభువు

మేము నీ బంట్లము, మేము నీ వాళ్ళము.

బ్లాక్ ఫిలిప్, సింహాలని వాటి గుహలోనే తింటాడు.

బ్లాక్ ఫిలిప్, బ్లాక్ ఫిలిప్, తలపై కిరీటం పెరుగుతుంది...

వెనక్కి పో! ఇద్దరూ, ఆపండి!

ఫిలిప్, వెనక్కి పో!

స్వర్గం ఆశీర్వదించు గాక!

కేలెబ్, తలుపు తీయి.

కేలెబ్!

లోపలకి పో!

ఆ!

నోరు ముయ్యండి!

పొద్దున్నుంచీ నువ్వు, కేలెబ్ ఎక్కడున్నారు?

ఎలా అలా వదిలేసి వెళ్లిపోయారు?

ఇంకా నువ్వు, నీకు చెప్పానుగా జోనస్, మెర్శిని కనిపెట్టుకొని ఉండమని.

నేను ఉన్నాను అమ్మా, వాళ్ళని సహాయం చేయమన్నాను, కానీ వాళ్ళు నా మాట వినడంలేదు.

- ఇంకా నేను... - ఏమైంది నీకు, తొమసిన్?

అస్సలు ఏం చేస్తున్నావ్?

మీ నాన్న బట్టలు కాలవ దగ్గరకు తీసుకెళ్ళి శుభ్రపరుచు.

- వాళ్ళు నా మాట వినడం లేదు. - బాగా సబ్బు పెట్టు బ్రష్ చెయ్యి.

తనకి సాయం చెయ్యి!

నా బాధ అర్ధం చేసుకోండి, ఎంత కంగారు పడ్డానో తెలుసా.

నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లొద్దు. వింటున్నావా?

పొద్దున పనంతా మిగిలే ఉంది.

జోనస్, నీ చెల్లిని వదిలిపెట్టు.

- తనకి నచ్చింది. - విలియం.

ఏంటి, ఒక తండ్రి తన కొడుకుతో కొంత సమయం గడపకూడదా?

జోనస్!

- నాన్న ఆపమని చెప్తున్నాడు. - తొమసిన్!

- ఆపు. - ఆపండి!

ఇద్దరూ, ఆపండి.

తొమసిన్, కవలల్ని లోనికి తీసుకుపో.

లేదు!

లోనకి పొండి, లోనకి, లోనకి పొండి.

నీ యిష్టం.

మేము ఆపిల్ ల కోసం వెళ్ళాం!

లోయ లోకి.

నేనో ఆపిల్ చెట్టుని చూశానని అనుకున్నా.

తోడేళ్ళు ఉంటాయేమో అని నాన్న తుపాకి తెచ్చాడు...

నాకెందుకు చెప్పలేదు?

నాన్న నిన్ను ఆశ్చర్య పరుద్దామనుకున్నాడు, ఆనంద పరుద్దామని.. కానీ..

అక్కడేమీ లేవు.

నేను నిజంగా చూశాను.

నువ్వు మన తోట నుంచి బయటకి పోవటం నాకు ఇష్టం లేదు, ఒక్క అడుగు కూడా.

నేను అర్ధమయ్యానా?

కేలెబ్, అమ్మకి కొంచం నీరు తీసుకురా.

కాలవ నుంచి మరీ దూరంగా పోకు.

ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?

సరే, ఏంటి?

ఏంటి?

కేలెబ్? కేలెబ్!

ఆపు.

నీకేం కాదులే.

ఏమైంది నీకు?

ఇలా రా.

ఏమైంది నీకు, ఆ?

ష్.

మనం ఇంగ్లండ్ నుంచి వచ్చేసిన తరువాత నాకు ఒక్క ఆపిల్ కూడా కనబడలేదు.

నీకు కనబడినా బాగుండేది.

నేనూ ఒకటి తినాలని ఎంతో ఆరాటపడుతున్నాను.

అది విన్నావా?

ఆ.

ఎవరక్కడ?

నేను అడవిలోని మంత్రగత్తె ని.

మెర్సి, బయటకి రా.

నేను మెర్సి ని కాదు.

నేను అడవిలోని మంత్రగత్తె ని, నిన్ను ఎత్తుకు పోవటానికే వచ్చాను.

నేను కర్రపై చెట్ల మధ్యలో ఎగరటం చూడండి:

కరకర-కరకర, కరకర-కరకర!

- మెర్సి! - కరకర-కరకర.

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left