200 ensimmäistä riviä.
నీ తాళాలు నీ దగ్గర ఉన్నాయి, కదా?
హా. అవును, ఉన్నాయి.
రాత్రి 11 గంటల 27 నిమిషాలు
స్నూజర్స్
హేయ్.
ఇక్కడ ఉన్నావు. నువ్వు నిద్రపోయావేమో అని ఒక్క క్షణం అనుకున్నాను.
లేదు. ఇంకా మెలకువగానే ఉన్నాను, ఎప్పటిలాగే.
స్లీప్ యాప్ ఎలా పని చేస్తోంది?
అంటే, ఒక రోజు రాత్రి దాన్ని మళ్లీ ప్రయత్నించి చూశాను.
ఆ మనిషి మనం నిద్రపోయే వరకూ మాట్లాడాలి, కదా? కానీ అతని గొంతు భలే సెక్సీగా ఉంది,
దానితో ఒక మండే ఆయిల్ రిగ్ నుండి అతను నన్ను కాపాడినట్లు ఊహించుకోవడం మొదలుపెట్టాను.
అది, ఒక రకంగా, గొప్పగా అనిపించింది కానీ నిద్రలేమితో బాధపడేవారికి అది పనికిరాదు.
ఎప్పుడైనా ప్రయత్నించి చూశావా?
లేదు.
హిప్నాటిజమ్, ఆక్యుపంక్చర్, ఏదీ పని చేయలేదు.
నేను ఒక పుస్తకాన్ని ఆన్ లైన్ లో కొన్నాను
అది పేరు వెయ్యినొక్క నిద్రలేమి సమస్యకు చికిత్సలు ఇంకా పరిష్కారాలు. చెత్త.
అది పరమ చెత్త పుస్తకం. అంటే, లావెండర్ పూలతో నింపిన టోపీ పెట్టుకోవాలట.
ఇంకెవరైనా నిద్రపోతున్న రికార్డింగ్ ని మనం వినాలట.
కేవలం ఒక ముక్కు రంధ్రంతోనే శ్వాస లోపలికి పీల్చాలట.
మెత్తని పరుపు మీద పడుకోవాలి. గట్టి పరుపు మీద పడుకోవాలి.
గట్టి పరుపు మీద మెత్తటి పరుపు వేసుకోవాలి.
తరువాత రెండు పరుపుల మీద పడుకోవాలట.
నోర్స్ దేవుడిని ప్రార్థించాలట. మన కళ్లని మర్చిపోవాలట.
లేదు. సరే, చూడు,
అలాంటి చిట్కాలు కొన్ని ప్రయత్నించా, కానీ, చూడు.
సారీ, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలేవీ నేను వినలేదు.
డానీ, నువ్వు ఎందుకు చీకటిలో పాకుతున్నావు?
- నా పక్కంటి మనిషి తెలుసుగా? - ఏంటి, ఆ పిల్లి మనిషా?
- ఆ పిల్లి మనిషి. - అది నీకు నచ్చిందా?
నా ఊహకి అందని ఏదో కారణం వల్ల, అతను తన పిల్లి పుట్టినరోజు పార్టీకి నన్ను ఆహ్వానించాడు.
దాని వయసు ఎంత?
దానికి పదిహేడేళ్లు. మేము అందరం వెళ్లి దానికి డ్రైవింగ్ పాఠాలు నేర్పాము.
ఏది ఏమైనా,
నేను ఎందుకు పార్టీకి వెళ్లలేకపోయానో ఒక సాకు చెప్పాల్సి వచ్చింది,
ఇంకా ఆ హడావుడిలో, నేను కొద్దిగా శ్రుతి మించి మాట్లాడాను.
దేనికి? అతనికి ఏం చెప్పావు?
ఒక నెల రోజుల పాటు విరామం తీసుకుని ప్రపంచంలో ఉన్న ప్రతి డిస్నీ ల్యాండ్ లో గడపబోతున్నానని చెప్పాను.
- అతనికి అలా ఎందుకు చెప్పావు? - ఎప్పుడూ వెళ్లలేదు. వెళ్లాలి అనుకునే వాడిని.
అది చూడటానికి ఇదే మంచి సమయం అనిపించింది.
కానీ నువ్వు ఎప్పుడూ బయటకు కూడా వెళ్లవు కదా.
అవును, నాకు తెలుసు. నా లాజిక్ లో లోపాలు ఉన్నాయి.
నేను లేనని అనుకుంటున్నాడు.
అతను నా వసారాలో పార్టీ చేసుకుంటున్నాడు. అది కొన్ని గంటలుగా నిరాటంకంగా సాగుతోంది.
సరే, అయితే వచ్చే నెలకి నీ ప్లాన్ అదేనా?
అతను బయటకి వచ్చినప్పుడల్లా, నువ్వు చీకటిలో అలా పాకుతుంటావా?
అవును. నేను ఇప్పుడు ఇరుక్కుపోయాను.
ఇంకా, మంచి విషయం ఏమిటంటే, లైట్లు, కరెంటు మీద నేను ఎంత డబ్బు ఆదా చేస్తానో ఆలోచించు.
ఆ కర్టెన్లు కిందికి దించుకోవచ్చు కదా?
నాకు అవేమీ లేవు.
నేను కొన్ని తెచ్చి వాటిని ఏర్పాటు చేశాక అతను చూస్తే గనుక, ఆలోచిస్తాడు,
"ఆ కర్టెన్లు ఎలా వచ్చాయి?" అని. నేను లోపల ఉన్నానని తెలుస్తుంది.
కాబట్టి ఇది క్యాచ్ 22 పరిస్థితి లాంటిది.
కేవలం ఒక ఊహ.
మరి భోజనం గురించి ఏం చేేస్తున్నావు?
లేదా మీ హాల్ లో ఆడమ్ ఇప్పటికీ నీ కోసం షాపింగ్ చేస్తున్నాడా?
లేదు, డిస్నీ ల్యాండ్ లో ఉన్నట్లు వాడిని కూడా నమ్మిస్తున్నా.
తను ఎలాంటివాడో తెలుసుగా.
అతనికి గనుక నిజం తెలిస్తే, ఈ మొత్తం బిల్డింగ్ లో అందరికీ ముప్పై సెకన్లలో విషయం చెప్పేస్తాడు.
- అవును. - చూడు, మరేం ఫర్వాలేదు.
నేను బాగానే ఉన్నాను. నాకు మంచిగా ఉంది. ఈ ఫ్లాట్ లో ఉన్నదానితో గడిపేస్తాను, అవి...
ఒక జాడీలో మయోనీస్ ఇంకా వేరువేరు రకాల ఫ్రాస్టీలు ఉన్నాయి.
అవును, నేను ఇదంతా సరిగ్గా ఆలోచించకుండా చేశాను, కదా?
ఇలాంటి సందర్భాలలోనే బయటకు వెళ్లగలిగితే
- కాస్త ఉపయోగంగా ఉంటుంది. - అవునా? ధన్యవాదాలు.
కానీ, నేను నిస్సహాయుడిని. ఇంకా ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. నేను ఒక పిజ్జా ఆర్డర్ చేయాలి.
పిల్లి మనిషి, డెలివరీల గొడవ.
ఎవరి నుండైనా దాక్కోవడం చాలా కష్టమైన పని.
నేను రిస్కు చేస్తా.
ఒక ప్రయోగం చేసి, సాధ్యమో కాదో చూస్తాను.
పిల్లి మనిషి ఎప్పుడూ బయటే ఉండలేడు.
సరే. ఒక యాంచోవీ చేప ఇంకా ఒక పైనాపిల్.
ఛీ, యాంచోవీ ఇంకా పైనాపిల్ పిజ్జాలా?
నిజంగా. అవి దారిలో ఉన్నాయి. నువ్వు ఎక్కడ?
రాత్రి వేళల కెమిస్ట్ దుకాణంలో.
పాపీకి చికెన్ పాక్స్ సోకింది.
చిన్న బబూన్ కోతి మాదిరిగా అది ఇప్పటికీ ఒళ్లంతా గోక్కుంటోంది,
ఇంట్లో పెరిడైన్ మందులు అయిపోయాయి.
దానికి తోడు, అది క్లాసులకు కూడా గైర్హాజరు అవుతోంది.
పేరెంట్స్ వాట్సాప్ గ్రూపులో వారం అంతా గొడవ చేస్తున్నారు. నాకు చిరాకుగా ఉంది.
నీకు ఎందుకు చిరాకు?
ఏం చెప్పానో గుర్తుంచుకో...
పాపీని స్కూల్ ట్రిప్ కి తీసుకెళ్లలేదు
- ఎందుకంటే తనకి చికెన్ పాక్స్ కదా? - ఏం అయింది, అమ్మా?
ఏమీ కాలేదు.
- అవును, మనం ఒక నిమిషంలో వెళ్తున్నాం. - అమ్మా!
మొదటగా నేను ఒక చిన్న పని చేయాలి.
సరే, నేను చేసేశాను.
అదిగో. ఇప్పుడు నువ్వు నిజంగా గొర్రెలా ఉన్నావు.
- బా! - బా.
నేను ఇంక ఏ రకంగానూ దీన్ని భరించలేను.
ఏంటి, ఆ జాక్ వాళ్ల పొగరుబోతు అమ్మని నన్ను మళ్లీ చేయనిస్తానా?
నీ దగ్గర అంతా బాగానే ఉందా?
అవును, బాగానే ఉంది.
మేము ఇంట్లో ఇలాగే చేస్తుంటాము.
నిన్న రాత్రి లసాంన్యా తిన్నాం. కడుపు పూర్తిగా కల్లోలం అయిపోయింది.
ఆమెకి అనుమానం వచ్చిందని నాకు తెలుస్తోంది, కానీ ఏదో రకంగా తప్పించుకున్నాను.
తెలివిగా చేశావు. ఇంకా, చూడు, నైతికంగా అది తప్పు కావచ్చు.
నువ్వు మళ్లీ మొదలుపెట్టకు. ఒక ప్రకటన చూశాను, అది స్నూజర్స్ అని కొత్త టాబ్లెట్లు గురించి.
నిద్రలేమితో బాధపడేవారికి అదనపు శక్తిని ఇస్తుందట.
ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను.
లేదు, వద్దు. వాటితో నీకు నిద్ర రాదు.
క్యాబేజీ మాదిరి రుచితో ఆ మందులు తయారు చేస్తారు.
క్యాబేజీ కాకుండా, వాటికి కొద్దిగా క్యాబేజీ లాంటి రుచి దానికి ఉండి ఉంటుంది.
నేను ఏం అంటానో నీకు తెలుసు, కదా?
వద్దు, ఈ సంభాషణ లేకుండా మనం కనీసం ఒక్క రాత్రయినా గడపగలమా?
నీతో కలిసి నిద్ర క్లినిక్ కి నేను రావడం లేదు.
ఇంకా చెప్పు.
లేదు. నేను నిద్రపోతుంటే క్లిప్ బోర్డులు పట్టుకున్న జనం నన్ను గమనిస్తుంటారా?
నిద్రపోయినప్పుడు, ఎవరూ చూడటం నాకు ఇష్టం ఉండదు.
అలాగే, చూడు...
నేను గుర్రుపెడుతుంటే గనుక...
నేను హస్తప్రయోగం చేసుకుంటే?
అంటే, నువ్వు నిద్రపోయే సమయంలో హస్తప్రయోగం చేసుకుంటావా?
నాకు తెలియదు, కానీ నేను మేలుకొని ఉన్నప్పుడు ఎన్నిసార్లు చేసుకుంటానో లెక్కవేస్తే,
నేను దానిని కాదనలేను.
ఏది ఏమైనా, నువ్వు నాతో ఈ రాత్రి గడిపితే వెజీ ఏమీ అనుకోడు కదా?
నాకు అనుమానమే. అతను నిన్ను అమ్మాయిల్లో ఒకరని అనుకుంటున్నాడు. చూడు,
మామూలుగా ఒక మహిళవి అనుకుంటున్నాడు.
అలా అనుకుంటున్నాడా? సరే, అది వినడానికి బాగుంది.
అలాగే ఉండు. వెజీ ఫోన్ చేస్తున్నాడు. మళ్లీ కాల్ చేస్తా.
హాయ్, వెజ్.
కంగారు లేదు. తను నిద్రపోతోంది,
ఇంకా నేను మంచి సవతి తండ్రిని.
నువ్వు ఎలా నిద్రబుచ్చావు?
తనకి కథ చదివి వినిపించా.
కానీ, నేనూ ప్రయత్నించా. ఏం కథ చదివావు?
అంటే, నీకు తెలుసా, అదీ ద హిస్టరీ ఆఫ్ బ్రిక్స్.
సారీ, ఏంటది?
ద హిస్టరీ ఆఫ్ బ్రిక్స్.
- అది ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు? - శనివారం కోసం.
- అవును, ఆ ఇటుకుల పని. - అవును, నా గురించి నీకు తెలుసు.
సంసిద్ధం కావడమే కీలకం.
పైగా, ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రస్తుం నేను పన్నెండవ శతాబ్దపు గోథిక్ కాలంలో ఇటుకల గురించి నేర్చుకుంటున్నాను.
సరే. అయితే, నీకు సంతోషంగా ఉంటే కానివ్వు.
దయచేసి నన్ను వదిలేయకు.
నీకు ఆ దురద మందులు దొరికాయా?
లేదు. నేను ఫార్మసిస్టు కోసం ఎదురుచూస్తున్నా.
సరే మంచిది. నేను ఇంకా ఏడు అధ్యాయాలు చదవాలి.
సరే. అయితే, ఆ కథ ముగింపు నాకు చెప్పు చాలు.
సరే, ఇందులో కథ లాంటిది ఉందని నేను అనుకోను...
నువ్వు జోక్ చేస్తున్నావు, కదా?
కొద్దిగా, అవును. ఇంటికి ఏమైనా తీసుకురానా?
నువ్వు ఎప్పుడూ నన్ను సర్ ప్రైజ్ చేస్తావు కదా.
సరే. సవాలుని స్వీకరిస్తున్నా. ఇంటికి వచ్చే ముందు మెసేజ్ చేస్తా.
- సరే. బై బై. - అలాగే, బై!
సరే, మనం ఎక్కడ ఉన్నాం?
అంతా బాగానే ఉందా?
అవును, అంతా బాగానే ఉంది. మోకాలి తొడుగులు. చక్కగా ఉన్నాయి.
- అతని కోసం వీటిని తీసుకుంటాను. - ఓహ్, సరే.
- ఈ వారాంతంలో అతను బ్రిక్-అథ్లాన్ లో పాల్గొంటున్నాడు. - బ్రిక్-అథ్లాన్ అంటే ఏంటి?
అది ట్రయాథ్లాన్ లాంటిది. మనం పరిగెడతాం, ఈత కొడతాం ఇంకా సైక్లింగ్ చేస్తాం.
కానీ చివరిలో మనం ఒక ఇటుక గోడ కట్టాలి.
ముచ్చటగా ఉంది.
నీకు వాళ్లు మందులు ఇంకా ఇవ్వలేదా?
లేదు. కౌంటర్ లో ఎవరూ లేరు. బహుశా వెనుక వైపు కౌంటర్ ఉందేమో.
అయితే, నీకు నువ్వే సాయం చేసుకో. వాళ్ల దృష్టిని ఆకర్షించు. గట్టిగా అరువు.
లేదు. నాకు అది ఇష్టం లేదు. మొరటుగా ఉంటుంది.
- ఏంటి? - నోరు మూయి.
నువ్వు నోరు మూయి. నేను ఏమీ అనలేదు. ఏం చేస్తున్నావు?
ఆమె జాక్స్ అమ్మ.
- లీసా. హాయ్. - కేట్, ఓహ్, దేవుడా. ఇది చాలా విచిత్రం.
- నా నుండి ఎందుకు దాక్కుంటున్నావు? - దాక్కోవడమా? దేవుడా, లేదు.
లేదు, అలా ఎందుకు చేస్తా... ఎందుకలా అనుకుంటావు... లేదు.
ఖచ్చితంగా నేను దాక్కోవడం లేదు.
జాక్ కి చికెన్ పాక్స్ సోకింది.
అయ్యో.
అన్నట్లు, పాపీ ఎలా ఉంది?
తను మాస్క్ తీయనివ్వడం లేదు, కదా?
లేదు. తను వేస్తున్న గొర్రె పిల్ల వేషం... వీలైనంత సహజంగా ఉండాలని ప్రయత్నిస్తోంది.
ఈ మధ్య మరీ మెథడ్ యాక్టింగ్ చేస్తోంది.
అయితే నీ చేతిలో ఉన్న ఆ కాలమైన్ లోషన్ సీసా
వేరేలా వాడటానికి తీసుకున్నావని అనుకోనా?
అవును, అంతే. ఖచ్చితంగా.
- సరే, నేను ఇంక వెళ్లాలి. - సరే.
ఫార్మసిస్టు ఎక్కడ?
నాకు తెలియదు. వాళ్ల కోసమే ఎదురుచూస్తున్నా.
- మరి, నువ్వు అరిచావా? - అది మంచి ఐడియా.
- లేదు, నాకు ఇష్టం లేదు... - హలో?
హలో?
సరే, మనం మరి కాసేపు ఎదురుచూడాలి అనుకుంటా.
ఇద్దరం కలిసి.
- నేను నీ కోసం ఇది కొంటాను? - నా కోసం ఎందుకు కొనాలి అనుకుంటున్నావు?
అంటే, తల్లులుగా మనం కలిసి ఉండాలి. నువ్వు తరువాత ఎప్పుడైనా నా కోసం ఏదైనా చేయచ్చు.
సరే. అయితే, థాంక్స్.
సరే.
సారీ, నేను ఇప్పుడు మాట్లాడచ్చా?
నేను ఇక్కడి నుండి బయటపడాలి.
నా ద్వారా అంటువ్యాధి సోకిన పేరెంట్స్ కి నేను ఎదురుపడలేను.
హలో? మిస్టర్ ఫార్మసిస్ట్?
మిసెస్ ఫార్మసిస్ట్?
- ఎవరైనా ఉన్నారా? - సరే, ఇది ఎలా ఉంటుంది?
ఆ లోషన్ తీసుకో ఇంకా ఆ డబ్బు అక్కడ పెట్టేయ్.
నేను ఆ పని చేయలేను. నా దగ్గర కార్డు మాత్రమే ఉంది.
సరే, కార్డు మెషీన్ ఎలా ఉపయోగించాలో నీకు తెలుసా?
నాకు నిజానికి తెలుసు. కానీ అది ఎందుకో తప్పు అనిపిస్తోంది.
- సరే, మంచిది. - చేసేయ్.
మంచిది.
లావాదేవీ ఆమోదం
No comments yet. Be the first to leave one.