Still Up

Still Up

Lataa Telugu -tekstitys

Kausi 1

Julkaisutiedot

Still Up S01E03 WEB x264-TORRENTGALAXY
Still Up S01E03 720p ATVP WEB-DL DDP5 1 Atmos H 264-CMRG
Still Up S01E03 1080p WEB H264-NHTFS
Kommentaari sash35

Tunnisteet

web
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
Julkaistu: 2023-09-24
Lataukset: 8
Kuulovammaisille: No

Telugu tekstityksen esikatselu

200 ensimmäistä riviä.

రాత్రి 8 గంటల 45 నిమిషాలు

ఆసక్తికరంగా ఉంది.

అది దవడ భాగం అని చెప్పగలను.

దవడ లేకుండా నువ్వు బతకగలవా?

తేలికగా.

నీ పళ్లు ముఖంలో నుంచి కింద పడకుండా ఏది ఆపుతుంది?

నన్ను నమ్ము. నేను ఓర్చుకోగలను.

ఏది ఏమైనా, "మోకాళ్లు లేకుండా" ఉండే జీవితం కంటే అది చాలా మంచి జీవితం.

కేవలం రెండు బిగుసుకుపోయిన కాళ్లు. పిచ్చితనం.

ఉదాహరణకి, ఫోర్క్ లిఫ్ట్ ట్రక్కుని ఎలా డ్రైవ్ చేయగలవు?

అది నా సమస్య కాదు.

బ్రేక్ డాన్స్. నువ్వు బ్రేక్ డాన్స్ చేయలేవు.

మళ్లీ, అది నా జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించదు.

మోకాళ్లు లేకుండా నేను తేలికగా బతికేయగలను. ముఖ్యంగా నా మోకాళ్లు. అవంటే నాకు చిరాకు.

నీ మోకాళ్లలో ఏ లోపమూ లేదే.

నీ ఉద్దేశం ఏంటి? అవి చాలా పెద్దగా ఉంటాయి.

నేను లెగ్గిన్స్ వేసుకున్నప్పుడు,

నేను రెండు కాలీఫ్లవర్లు స్మగ్లింగ్ చేస్తున్నామో అన్నట్లు ఉంటాయి.

ఆసక్తికరంగా ఉంది. చూడు, నేను సాట్సుమాస్ పండ్లు అంటాను.

థాంక్స్.

వెజీ.

ఎయిర్ పోర్ట్ నుండి నాకు ఏమైనా కావాలా?

- ఒక పెద్ద టోబ్లరోన్. సహజంగా. - సహజంగా.

వెజ్ ఇంటికి రావడం కోసం ఎదురుచూస్తున్నా.

- అతని కోసం వంట చేస్తాను. - ఏంటి, నువ్వా?

అవును. థాంక్యూ, డానియెల్. నేను వంట చేయగలను.

ఏది ఏమైనా, ఈ రాత్రి చాలా ముఖ్యమైన రాత్రి.

ఏమీ ఏ వేళకి వస్తోంది?

రాత్రి తొమ్మిది తరువాత.

తన చివరి క్లయింట్ ని చూసుకుని వస్తుంది.

సరే. తను ఇంతకీ ఏం చేస్తుంది?

- పర్సనల్ ట్రైనర్. - పర్సనల్ ట్రైనర్.

అలాంటి వాడితో నేను డేట్ కి వెళ్లాను. ఒక విషయం తెలుసా?

వాడు శృంగారంలో ఫోర్ ప్లే ఆపి ఫిట్నెస్ వాచీ ఆన్ చేసేవాడు.

నిజం చెప్పాలంటే, అది నా మూడ్ ని పాడు చేసేది.

నిజంగానా? అన్నట్లు గుర్తొచ్చింది.

ఆ డేటింగ్ సైట్ కి పాస్ వర్డ్ ఏంటి మళ్లీ చెప్పు?

నా డైరెక్ట్ మెసేజ్ లు ఒకసారి చెక్ చేసుకుంటాను, ఎందుకంటే,

చెప్పిన కథలే మళ్లీ చెప్పకుండా చూస్తాను.

అవును. పొటాటో123.

పొటాటో... పొటాటో123?

అవును. పొటాటో123.

- పొటాటో123. పొటాటో123. పొటాటో123. - అయితే, నువ్వు, అంటే,

అసలు బయటకు రాలేకపోవడం గురించి మొత్తంగా ఆమెకు ఏం చెప్పావు?

అవును. చెప్పాను. నీకు ఇది నచ్చుతుంది.

నేను చెప్పలేదు.

డానీ, ఆమెకి చెప్పేయ్. తను అర్థం చేసుకుంటుంది.

ఇది మాకు మొదటి డేట్.

మా మధ్య స్నేహం బలపడిన తరువాత ఆమెకి చెబుతాను.

అంటే అప్పటికి మేము ఏ వృద్ధాశ్రమంలోనో కలిసి ఉంటాం.

సరే. మంచిది. అయితే నువ్వు ఏం వంట వండబోతున్నావు?

- ఎక్కడ పెట్టమంటావు, డానియెల్? - ఆ టేబుల్ మీద పెట్టు. చీర్స్, ఆడమ్.

ఆడమ్ వంట చేస్తున్నాడా?

లేదు, అతను కొన్ని సరుకులు తీసుకొచ్చాడు అంతే.

నీతో పాటు నన్నూ తీసుకెళ్లు.

- హాయ్, ఆడమ్. - హాయ్, లీస్.

మంటలార్పే పని ఎలా నడుస్తోంది?

అవును, బాగుంది. అంటే, అంత బాగా లేదు. ఏ మంటలూ మంచివి కావు.

అది మా ముఖ్యమైన నియమం.

సరే. మరి, ఈ పని చేస్తూ నీకు వివరిస్తా.

ఈ ఉదయం నేను కూరగాయలు కొనడానికి వెళ్లాను, కాబట్టి అవి చాలా తాజాగా ఉన్నాయి.

- డానీ, తను కూరగాయలకి వెళ్లా అన్నాడా? - అదే అనుకుంటా, అవును.

కాబట్టి ఇక్కడ, నెటెల్స్ ఉన్నాయి. ఏడాదిలో ఈ కాలంలోనే ఇవి బాగా పండుతాయి.

నెటెల్స్ తినడానికి ఏడాదిలో మంచి సమయం అనేది ఎప్పుడూ ఉండదు అనుకుంటా.

ఇంకా నీకు కావలసిన అడవి వెల్లుల్లి, చెస్ట్ నట్స్ తెచ్చాను.

ఏమైనా సందేహాలు ఉన్నాయా?

- ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. - సరే, మరి, నాకు అయితే,

నేను వీటన్నింటినీ నూనెలో వేయించి కాస్త అన్నంతో కలిపి తినడానికి ఇష్టపడతాను.

నీ దగ్గర వైల్డ్ రైస్ ఉందా?

- నా దగ్గర వైల్డ్ రైస్ ఉండటమా? - లేదు. నీ దగ్గర వైల్డ్ రైస్ లేదు.

కంగారు పడకు. నీతోనే ఉంటాను. ఒక సెకనులో తిరిగి వస్తా. ఎక్కడికీ వెళ్లద్దు.

డానీ, ఆడమ్ నీ కోసం చాలా చేస్తున్నాడని నీకు అనిపించడం లేదా?

నీకు బట్టలు ఉతుకుతాడు, షాపింగ్ చేస్తాడు ఇప్పుడు అడవిలో కాయగూరలు ఏరి తెస్తున్నాడు.

అతనికి సాయం చేయడం ఇష్టం. నేను తనని ఆపడం లేదు.

అతడిని వాడుకుంటున్నావు అనిపిస్తోంది.

ఇదిగో తెచ్చేశా. వైల్డ్ రైస్.

అద్భుతం. థాంక్యూ. సరే, ఆడమ్. ఇది విను.

మేము ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము.

నువ్వు నీ శరీరంలో ఒక అవయవం లేకుండా బతకాలి అంటే, అది ఏమై ఉంటుంది?

ఆడమ్?

ఆడమ్?

- ఆడమ్? - ఆడమ్?

నేను ఏది లేకుండా ఉండగలనో నాకు తెలియదు,

కానీ నా ముక్కు లేకుండా నేను ఖచ్చితంగా బతకలేను.

- ఎందుకని? - నేను దాన్ని మిస్ అవుతాను.

తొంభైల కాలంలో జరిగిన ఒక సంఘటన అది

మా అంకుల్ బ్రయన్ ఒక భవననిర్మాణ సంస్థలో పని చేసేవాడని మీకు చెప్పానా?

అక్కడ అతను తన సహచరుడు ట్రెవర్ తో కలిసి పని చేస్తుండగా,

వాళ్ల పైన ఉన్న ఆరు అడుగుల మెటల్ షీట్ అమాంతం ఊడిపోయింది,

అది కిందపడింది, మా అంకుల్ కి తృటిలో ప్రమాదం తప్పింది, కానీ వూష్...

ట్రెవర్ ని పట్టుకున్నాడు.

అది ఆయన ముక్కు కొనని కోసేసింది.

మా అంకుల్ ఎలాగో ఆ కొనని వెతికి తీసుకున్నాడు.

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా...

- వద్దు! దాన్ని తినద్దు! - దాన్ని ఆయన నోట్లో పెట్టేసుకున్నాడు.

దాన్ని ఆయన నోట్లో పెట్టుకున్నాడా?

- అవును, నువ్వైనా అదే చేస్తావు, కాదా? - లేదు, ఎవరూ చేయరు.

- లేదు, అలా ఎవరు చేస్తారు? - లేదు. మనం చేయం.

దాన్ని తాజాగా ఉంచగలిగేది నోరు మాత్రమే.

లేదు. సారీ. అది నిజం కాకపోవచ్చు.

కానీ ఆగు. మీ అంకుల్ తన ఫ్రెండ్ ముక్కు కొనని నోట్లో పెట్టుకున్నాడా?

అది ఆరోగ్యకరం కాదు. మరి తరువాత ఏం జరిగింది?

అప్పుడు, వాళ్లు ట్రెవర్, ఆ ముక్కు కొనతో సర్జన్ దగ్గరకి వెళ్లి

కుట్లు వేయించారు.

ఇప్పుడు ట్రెవ్ కుమార్తెకి మా అంకుల్ గాడ్ ఫాదర్ అయ్యాడు.

ఇంకా అతని ముక్కు మాత్రం, కొన్ని యాంగిల్స్ లో ఏదోలా కనిపిస్తుంది.

కొందరయితే, అది నమిలి ఉమ్మేసిన మాంసం ముద్దలా ఉందంటారు.

అవును. అంటే, ఆ పోలిక సరిగ్గా సరిపోతుంది.

నేను మేడ మీదకి వెళ్లి మిస్టర్ షమిమ్ కి స్నానం చేయడంలో సాయం చేయాలి.

ఏమైనా సమస్యలు ఉంటే, నేను హాల్ ముందే ఉంటాను, సరేనా?

- చీర్స్, ఆడమ్. సాయం చేసినందుకు సంతోషం. - బై, లీస్!

బై.

ఆ కుర్రాడు మరీ మంచివాడిలా ఉన్నాడు. అతను ఇంకా ఒంటరిగా ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను.

చూడు, నువ్వు నా గురించి ఎప్పుడూ అలా అనలేదు.

కానీ, డానీ, నీతో కలిసి ఎవరైనా బయటకి ఎందుకు వెళ్లలేదో

- నాకు అర్థం కావడం లేదు. - అవును. సరైన అనుమానమే.

నేను జోక్ చేశా.

ఈ ఏమీ నీకు సరిపోతుంది అనుకుంటా.

నువ్వు విచిత్రమైన వాడివని ఆమె నిన్ను ఏడిపించకుండా ఉండాలి.

ఏంటి, నువ్వు ఇందాక అక్కడ చేసినట్లా?

అంటే, అవును. కానీ అది వేరు. ఎందుకంటే అలా చేసే హక్కు నాకుంది.

సరే. అలాగే. నిజం చెప్పాలంటే, నేను కొద్దిగా భయపడ్డాను.

ఆ మొత్తం సంభాషణ,

దాదాపు ముప్పై ఆరు చదరపు కిలోమీటర్ల దూరంలో ఆమె ఉంది,

ఆమెకు మెసేజ్ పంపడం నన్ను బాగా భయపెట్టింది.

కానీ నా ఫ్లాట్ కి ఆమె వస్తోంది, నా అండర్వేర్ల బల్లకి కొద్ది గజాల దూరంలో నిలబడబోతోంది.

నేను బాగా మాట్లాడతానని ఆశిస్తుంది, ఆసక్తికరమైన విశేషాలు చెబుతానని చూస్తుంది.

అది నన్ను భయపెడుతుంది. మిగతా అందరూ అవన్నీ ఎలా చేస్తారో అర్థం కాదు, తెలుసా?

చెప్పడానికి నా దగ్గర కథలు కూడా ఏమీ లేవు.

ఎందుకంటే నేను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను. కాబట్టి నాకు సంఘటనలు ఉండవు.

నేను ఆఫ్టర్ షేవ్ లోషన్ ఎక్కువ రాసేసుకున్నాను అది ఇప్పుడు ముఖాన్ని మండిస్తోంది ఇంకా,

అది నా ముక్కుపుటల్లో మంట పెడుతోంది.

ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం, ఏమీ ఈ నెటిల్స్ ని ఇష్టంగా తినే అవకాశాలు ఎంత ఉంటాయి?

ఏంటి, ఏ కుక్కో ఖచ్చితంగా ఉచ్చపోసిన ఆ నెటిల్స్ గురించి అడుగుతున్నావా?

చరిత్రలోనే ఇది అత్యంత చెత్త డేట్ కాబోతోంది.

లేదు, అలా కాదు. అది గొప్పగా జరుగుతుందిలే.

పైగా, చరిత్రలో అతిచెత్త డేట్ నాకు ఇప్పటికే జరిగింది.

దాని గురించి చెప్పు. ఎందుకంటే అది బాగుంటే గనుక, అది నా సొంత కథగా మార్చుకుంటాను.

అంటే, అతను ఒక ప్రదేశం ఎంపిక చేశాడు.

మేము కొన్ని బీర్లు తాగాము. కాసేపు చక్కగా మాట్లాడుకున్నాము.

ఆ తరువాత మేము వేరే చోటుకి మారాలని అతను సూచించాడు. నేను చెప్పాను...

అలాగే. తప్పకుండా.

అప్పుడు నాకు తెలిసింది, మా టేబుల్ కేవలం టేబుల్ కాదని.

ఏం జరుగుతోంది?

లండన్ లో వీ టోస్ట్ ని పంచుకుందాం

అది ఒక సైకిల్ కూడా.

దాదాపు 11 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కించాడు.

ఇంకా ఒక వారం రోజుల వరకూ

కార్ పార్క్ లో దారి తప్పిన కౌబాయ్ లాగా నడుస్తూ ఉన్నాను.

అవును. లేదు, అది చాలా ఘోరం.

విను. ఈ వారం రోజులుగా నేను దీని గురించే ఆందోళన పడుతున్నాను.

నాకు కొన్ని ఐడియాలు తట్టాయి

అవి ఆమెని సౌకర్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయేమో చూడు.

ఖచ్చితంగా ఆలోచించే ఉంటావు. అయితే చెప్పు. అవేమిటో విందాం.

సరే. మొదటి ఐడియా.

నా కప్ బోర్డులకు ఉన్న తలుపులు అన్నీ తీసేయనా

అప్పుడు నేను ఈ అల్మారాల్లో ఏ ఆయుధాలో లేదా రికార్డింగ్ పరికరాలో

దాచడం లేదని ఆమెకు తెలుస్తుంది?

- వద్దు. - సరే. ఈ ఐడియా వింటావా?

నేను రెండు జతల ప్యాంట్లు తొడుక్కోనా?

ఒక విషయం తెలుసా?

నీ ప్యాంట్ జిప్ దగ్గర తాళం పెట్టుకోవచ్చు కదా?

అది నిజంగా ఆమెను చాలా సౌకర్యంగా ఉంచచ్చు.

అది ఎందుకంటే... నీ ఉద్దేశం ఏంటి? నిజంగా?

లేదు! అల్మారాలకి తలుపులు లేకుండా

రెండు ప్యాంట్లు వేసుకునే వాడిని చూస్తే నేనయితే భయపడిపోతాను.

నువ్వు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నావో తెలుసా?

- ఏంటి? - స్వయంగా వెన్నుపోటు పొడుచుకుంటున్నావు.

నువ్వు ఎలాంటి వాడివో తెలుసు.

నిన్ను నువ్వు స్వయంగా నాశనం చేసుకోగలవు

అప్పుడు నువ్వు సంతోషంగా లేకుండా జీవితాంతం ఒంటరిగా బతకచ్చు అనుకుంటావు.

నేను అలాంటివాడిని కాదనుకుంటా.

నిత్యం ఉల్లాసంగా గడిపే ఒంటరివాడిని నేను.

సరే, ఉల్లాసంగా గడిపే ఒంటరివాడా, కేవలం ఒక్క రాత్రికి అయినా,

ఒంటరిగా ఎంజాయ్ చేయడానికి ఎందుకు ప్రయత్నించవు?

నాకు నేను ఎంజాయ్ చేయడం అంటే నాకు చిరాకు. నాకు కడుపు నొప్పి వస్తుంది.

- ఆమె వచ్చింది. - అవును. తనే అని నాకు తెలుసు. నాకు వినిపిస్తోంది.

- సరే. - రిలాక్స్.

- ఇంకా... అది చాలా కష్టం. - సరే.

లేదు, అవి అలా వదిలేయ్. అవి బాగున్నాయి.

నేను బాగానే ఉన్నాను. ఉష్...

- ప్రశాంతం. - ప్రశాంతంగా ఉన్నా.

"ప్రశాంతంగా ఉండు" అని చెప్పకు, అప్పుడు నేనలా ఉండలేను.

కంగారు పడకు.

నువ్వు బాగా చేయగలవు. నీకేం ఫర్వాలేదు.

- హేయ్. - హాయ్.

అలాంటి గొంతుతో మాట్లాడకు.

నాకు తెలుసు. నోరు మూయి.

ఆగు.వస్తున్నా.

- రెండు సెకన్లు. - సరే.

ఇది నయం.

అది తనే. ఇక్కడికి వచ్చేసింది.

- కాబట్టి,నేను వెళ్లి... అవును. - అవును, ఆమె వచ్చింది.

- నీకు వివరాలు చెబుతుంటాను. - సరే.

బాగా చేయగలవు. నీకేం ఫర్వాలేదు.

మామూలుగా ఉండు చాలు, సరేనా?

ఆ మాట చెప్పకు.

ఎక్స్ క్యూజ్ మీ, సర్. సర్?

కానివ్వు.

ఏమీ.

More Telugu subtitles for Still Up

Kommentit

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left