The Expanse

The Expanse

تنزيل الترجمة Telugu

الموسم 4

معلومات الإصدار

S04 - AMZN WEB-DL - NTG / STARZ / MEMENTO / ION10
تعليق من bontoutou
Official Subtitles - NTG / STARZ / MEMENTO / ION10 / 4FiRE / HWD / CiELOS / WAYNE / FENDT

الوسوم

Web-DL
web-dl
web
WEB-DL
نشرت في: 2019-12-15
تنزيلات: 23
ضعاف السمع: No

معاينة ترجمة Telugu

أول 200 سطر.

ఇంతకుముందు ఎక్స్ పాన్స్ లో

మనం కొత్త శక ఆరంభంలో వచ్చాము.

మనకు తెలియని వాటిని కలిసి ఎదుర్కొందాం.

అదేంటో నాకు తెలియదు.

కానీ అదేంటో తెలుసుకోవడానికి చాలా మంది ఇక్కడ ప్రయత్నిస్తున్నారు.

నీకు తోడుగా నేనున్నాను.

సరే మంచిది, నేను నీ కెప్టెన్.

మనం కలిసి పనిచేయాలి.

కొత్త బెల్టర్ రాజ్య మేలు కోసం.

డిటెక్టివ్ మిల్లర్ వీనస్ మీద కూలిపడ్డాడు.

నేను ప్రస్తుతం విచారించేవాడిని మాత్రమే. విషయాలు కనుక్కొంటాను.

నీ బుర్రలో వందల కోట్ల కణజాలాలు

వాటిలో కోట్లకొద్దీ కణాలను నేను నెడుతూ కలిసి ఒకేవిధంగా ఆలోచిస్తున్నాం.

నీవు మిల్లర్ తో మాట్లాడుతున్నావు.

మిల్లర్ నాకు కొన్ని చూపించాడు. మొత్తం నాగరికత అంతా.

ఈ అంతరిక్షాన్ని, కేంద్రాన్ని వాళ్లు రూపొందించారు.

ఏదో వారిని చంపేసింది.

వాళ్లు దానిని ఆపడానికి యత్నించారు, మొత్తం సౌర వ్యవస్థను నాశనం చేశారు.

కానీ అదే పనిచేయలేదు.

మనం బాంబు పేల్చినపుడు, మనమే ముప్పుగా అయ్యామని అనుకుంటున్నా.

మన నౌకలు ఫ్యూజన్ బాంబులని మనమే ఆ స్టేషన్ కు నేర్పించాం.

ఫ్లోటిల్లాలోని ప్రతి రియాక్టర్ ను మనం మూసేయాలి.

ఈలోపే మనం ఇది చేయకపోతే ఆ స్టేషన్ మనందరినీ తుడిచిపెట్టేస్తుంది.

మనమంతా కలిసి కట్టుగా చివరి వరకు.

మనకు తెలియని వాటికి ప్రతిస్పందిస్తూ

ఇప్పుడు మనమే ఆపదలో ఉన్నాం.

ఏం చేయాలో తెలియక మనం హింసవైపు మొగ్గుతున్నాం.

కాల్చకండి!

ఛా!

నీవు మాకు కొత్త ఎల్లలిచ్చావు.

ఆ రింగు అవతల 1300 నివాసయోగ్య వ్యవస్థలు ఉన్నాయి.

ఇది మరొక రక్తదాహంతో కూడిన బంగారాల వేట అవుతుంది.

ఆ రింగులను నిర్మించిన నాగరికత పోయింది. తుడిచిపెట్టుకుపోయింది.

- వాళ్లను ఏది చంపి ఉంటుంది? - అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా.

ఒక ప్రయాణం చేయాలి.

ఎక్స్ పాన్స్

సౌర వలయం

గుర్తించని బెల్టర్ నౌకలారా, మీరు అనుమతి లేని స్థలంలోకి ప్రవేశిస్తున్నారు.

వెంటనే దిశ మార్చుకోండి, లేదా కాల్పులు జరుపుతాం.

బార్బాపికోలా, మేము యు.ఎన్.ఎన్. ట్రిపోలి.

మీ ఇంజన్ వెంటనే ఆపేయండి, లేదా మేము కాల్పులు జరుపుతాం.

వెంటనే స్పందించండి.

మేము నిరాయుధులం! ఇది కాందిశీక నౌక!

అమ్మా, నాకు భయం వేస్తుంది.

ఏం జరిగినా సరే, మనం కలిసే ఉంటాం.

కలిసే ఉంటాం.

ట్రిపోలి, మీకు రింగ్ స్థలం లోపల కాల్పులు జరిపే అధికారం లేదు.

బార్బపికోలా, మిమ్మల్ని కట్టుబడమని ఓపిఎ ఆదేశిస్తుంది.

మేము కట్టుబడము!

గానిమీడ్ పడిపోయినప్పట్టి నుండి మిమ్మల్ని రేవు కోసం అర్థిస్తున్నాం.

మమ్మల్ని ఎవరూ ల్యాండ్ కానివ్వడం లేదు.

మీరు మమ్మల్ని చంపాలనుకుంటే,

వెంటనే చేయండి, లేదా మమ్మల్ని వెళ్ళనివ్వండి.

వెళ్ళు! వెళ్ళు! వెళ్ళు! వెళ్ళు!

వెళ్ళు! వెళ్ళు! వెళ్ళు!

వెళ్ళు! వెళ్ళు! వెళ్ళు!

భూమి & లూనా ఐక్యరాజ్య సమితి

8 నెలల తరువాత

కాఫీ చాలా బాగుంది.

నయోమితో మాట్లాడావా?

తనను కలవడం బాగుంది, కాకుంటే తనని చూసింది తెరపైన.

తను పొలం చూడడానికి రాలేకపోవడం సిగ్గుచేటు.

అమ్మా.

మీరు వెళ్ళింది చాలా సుదీర్ఘమైన ప్రయాణం.

తను దారిలో గురుత్వాకర్షణ మాత్రలు వేసుకోవలసింది.

అది అంత సులభం కాదు.

ఆ మందులు ఘోరంగా ఉంటాయి.

నా కోసం తనని ఆ పని చేయమని నేను అడిగేవాడిని కాదు.

పైగా ఇది తన సొంత గ్రహం కాదు.

చాలామంది బెల్టర్లకు భూమి గురించి సానుకూల, ప్రతికూల భావాలు కలిసుంటాయి.

ఇదిగో.

ఇది నీ తరువాతి సుదీర్ఘ ప్రయాణానికి.

సెర్వాంటెస్ డాన్ క్విక్జాట్

నేను దీన్ని మళ్ళీ చదవాలేమో.

అక్కడ ఏం చూసావు?

అది మాటల్లో చెప్పడం కష్టం.

తుఫాను వస్తుంది.

నేను ఇంటి తలుపులు, కిటీకీలు మూస్తాను.

నేను కూడా లోపలికి వస్తాను.

భారీ వర్షం కురుస్తుందేమో కదా?

ప్రతి సందర్భానికి సరిగ్గా సరిపోయే మాటలు.

హే.

- మనం ఆ ప్రయాణం గురించి మాట్లాడాలి. - ఆ ప్రయాణం. అవును, నాకు తెలుసు.

అది కేసులో తరువాతి ఆధారం.

మనం రేపు వెళ్తున్నాం.

మనం రింగ్‌కు వెళ్తున్నామా?

మనం న్యూయార్క్‌కు వెళ్తున్నాం.

న్యూయార్క్‌లో ఏముంది?

పొడవాటి భవనాలు, మంచి పిజ్జా.

నన్ను రమ్మని ఆఙ్ఙాపించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి.

కాబట్టి, నువ్వు తనని అడగవచ్చు.

నిన్ను రింగ్ గుండా వెళ్ళనివ్వమని తనకు చెప్పు.

నేను ఒక వందసార్లు అడిగాను.

అయినా మళ్ళీ అడుగుతాను.

తను మాట్లాడాలి అందంటే, ఏదో మారి ఉంటుంది.

మనం ఆ ప్రయాణం గురించి మాట్లాడాలి, బాబు.

కేసులో తరువాతి ఆధారం.

ఆ వర్షం రుచి ఎలా ఉంటుందో.

నా చిన్నతనంలో నాకు వర్షం అంటే ప్రాణం.

నేను ఇక్కడ కూర్చుని, మెరుపులతో వచ్చే తుఫాను చూసే వాడిని.

వినడానికి బాగుంది.

మనం ఆ ప్రయాణం గురించి మాట్లాడాలి, బాబు.

కేసులో తరువాతి ఆధారం.

సరే మిల్లర్, అది నేను చూసుకుంటాను.

మనం వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఒక రోజు లభిస్తుందని ఆశిస్తున్నాను.

అంటే, నేను మంచి డాన్సర్‌ను.

హోల్డెన్ ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు,

సరే, సరే, సరే.

- ఇప్పటికి సెలవు. -బై.

అది భరింపశక్యంగా లేదు.

అవును, నిజమే.

నిన్ను త్వరలో కలుస్తాను.

లవ్ యూ.

కొత్త రైల్‌గన్ బాగుంది.

నువ్వు థ్రస్ట్ కంపెన్సేటర్‌ను తనిఖీ చేయాలి.

దీన్ని మన డ్రైవ్‌కు సరిగ్గా కట్టకపోతే,

అది కాల్పులు జరిపిన ప్రతిసారి మనం సీలింగ్‌కు కొట్టుకుంటాం.

అదే పని మీదున్నాను.

హే, ఏమస్.

మెల్బా?

దయచేసి క్లారిస్సా అను.

నెల క్రితం నాకొక వీడియో సందేశం వచ్చింది.

నాకు కాల్ చేసి చెప్పడానికి అప్పుడు ఎవరూ లేరు.

సరే.

అయితే నువ్వు సముద్ర తీరానికి వస్తావా?

లేదు.

అలలు నీ కాళ్ళని తాకుతుంటే అనుభూతి చెందడానికి కూడా రావా?

నా గతంలో చాలా గతం ఉంది, కాబట్టి దాన్ని దాటేస్తాను.

సరే, కనీసం నీకు ఎంచుకునే అవకాశం ఉంది.

నేను నా మిగిలిన జీవితమంతా ఇక్కడే గడిపేస్తాను, నాన్నలాగా.

అవును, వాళ్ళు నిన్ను తీవ్రంగా శిక్షించారు.

ధన్యవాదాలు చెప్పడానికి కాల్ చేసాను.

దేనికి?

ఇంటికి వెళ్ళే దారిలో గడిచిన నెలలు, నన్ను నీతో షాప్‌లో పని చేయనిచ్చావు.

దాని వల్ల స్థిమితంగా ఉండగలిగాను.

నువ్వు మంచి మెకానిక్‌వి.

నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను.

ఎయిర్‌లాక్‌లో సీళ్ళు ఎలా ఉన్నాయో తనిఖీ చేయమని నువ్వు నన్ను పంపావు, గుర్తుందా?

- అవును. -సేఫ్టీలను ఓవర్‌రైడ్ చేసారు

నేను కావాలంటే, అందులో ఉన్నప్పుడు బయటి తలుపును పేల్చేసి,

చనిపోయి ఉండేదాన్ని.

అవును.

అది కావాలని చేసిన పనా?

నేను యావజ్జీవ శిక్షను అనుభవిస్తుంటే,

నాకు ఆ అవకాశం ఉండాలి అనుకుంటాను.

ఆ అవకాశం ఇవ్వడం నీ మంచితనం.

కానీ ఆన్నా చెప్పింది నిజం. నేను...

- నాకు సులభంగా బైటపడే అర్హత లేదు. - ఆపు.

బాగా ఊపిరి పీల్చుకో, ఊపిరి వదులు.

తిను, విసర్జించు, నిద్రపో.

వాళ్ళు నీకేది ఇచ్చినా తీసుకో,

తిరిగి ఏమీ ఇవ్వకు.

నేను వెళ్ళాలి.

నాకు కలల చికిత్స చేస్తున్నారు. నిజానికి నాకది అర్థం కావట్లేదు కానీ,

వైద్యురాలి ఆఫీసు గదిలో పూలున్నాయి, గాజు తలుపు నుండి వాసన వస్తుంది.

నీ చికిత్సకు గుడ్ లక్.

నీతో మళ్ళీ మాట్లాడవచ్చా?

తప్పకుండా, పీచెస్.

నాకు కావలసిందల్లా రింగ్ బ్లాకేడ్ వద్ద మరిన్ని నౌకలు.

యు.ఎన్. భవంతి న్యూ యార్క్ నగరం

మీ నుండి కావలసింది అది జరిగేలా చేయడం.

ఔటర్ ప్లానెట్స్‌లోని మా ఆస్థులన్నీ నాశనం చేయబడ్డాయి.

హోమ్ ఫ్లీట్ అంశాలను తిరిగి నియమించవచ్చు.

అసలు తనెక్కడ ఉన్నాడు?

కుజగ్రహం గురించి మరిచిపోయారా?

ఇది కొత్త ఆరంభం. ఇప్పుడు మనమంతా స్నేహితులం.

కార్యదర్శిగారు, నేను...

నాన్సీ నాతో మళ్ళీ ఈ గోల మొదలుపెట్టకు.

మన జనాభాలో సగం మంది నిరుద్యోగులు, ఒక శతాబ్దంలో, వారికి ఉద్యోగాలివ్వడానికి

ఒక ప్రయోజనం చేకూర్చడానికి మనకు పెద్ద అవకాశం ఇవ్వబడింది.

ప్రతి వారం మన ప్రజలతో నిండిన మరో నౌక బ్లాకేడ్ వద్దకు వస్తుంది,

మనం వారిని వేచి ఉంచుతున్నాం.

వారు దొంగల నుండి ఏ రక్షణ లేకుండా ఉంటున్నారు.

వారికి కొత్త లోకాలు అన్వేషించాలని ఉంది. మనం అనుమతినివ్వాలి.

కొలంబస్ అమెరికా తీరానికి చేరినప్పుడు, తనను పలకరిస్తుంది మనిషి అని అయినా తెలుసు.

రింగ్స్‌కు మనం వందల ప్రోబ్స్ పంపించాం,

ఒక్కదానికి కూడా ఏ గ్రహాంతరవాసి జాడ దొరకలేదు.

మనకు అవి ఇంకా కనిపించలేదు కాబట్టి, అవి లేవనా? అదేనా నీ వాదన?

కొత్త స్థలానికి అంతా ఒకేసారి ఎగబడితే నియంత్రించలేము.

యూకాన్ నుండి శవాల సంచులు గుట్టలుగా తిరిగి వచ్చినప్పుడు,

వేలమంది ఆశగల మూర్ఖులు తరువాతి శవాలుగా మారడానికి లైన్లు కట్టారు.

గానిమీడ్ నౌకల పైన మనం కాల్పులు జరిపినప్పుడు

వీధులలో గొడవలు జరగకపోవడానికి కారణం వారంతా బెల్టర్లు కావడమే.

ఇప్పుడో తరువాతో, ఒక భూ నౌక బ్లాకేడ్ దాటడానికి ప్రయత్నిస్తుంది.

అప్పుడు మన పౌరుల పైనే కాల్పులు జరుపుతారా

లేక ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకుంటామా?

మనం ఏం చేస్తామని నేను చెప్పానో, అదే చేయబోతున్నాం.

హోల్డెన్ వచ్చాడు.

కాబట్టి, అది చేయండి.

నీకు బార్బపికోలా గురించి తెలుసా?

గానిమీడ్‌కు చెందిన శరణార్థ నౌక.

బ్లాకేడ్ పెట్టడానికి ముందు రింగ్ నుండి జారుకున్న నాలుగు నౌకల్లో అది ఒకటి.

వాటి నుండి మళ్ళీ ఎప్పుడూ వినలేదు.

వాటి నుండి మళ్ళీ కబురు వచ్చింది.

ఈ నాలుగు వ్యవస్థలకు ప్రాధాన్యతనిస్తూ, బెల్టర్లు రింగ్ గేట్ల గుండా

సమాచార రిలేలు స్థాపిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఆ రిలేలు పని చేయడం మొదలయ్యి,

ఒక వ్యవస్థ నుండి ప్రసారాలను అందుకోవడం మొదలుపెట్టాయి.

ఏదో మాయ వల్ల, ఈ లోకంలో బెల్టర్‌లు బ్రతికారు,

దాదాపు 100మంది వరకు.

التعليقات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left